Karnataka: రోడ్డుపై మహిళను కౌగిలించుకున్న మందుబాబు.. తిక్క కుదిర్చిన స్థానికులు !

  • బెంగళూరు సమీపంలోని యలహంకలో ఘటన
  • నిందితుడిని చావగొట్టిన స్థానికులు
  • కేసు నమోదుచేసిన పోలీసులు

పీకల దాకా మందు కొట్టిన ఓ యువకుడు రెచ్చిపోయాడు. దారిన వెళ్లే ప్రతీ మహిళను ప్రేమగా హత్తుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అటుగా వీధిలో వెళుతున్న ఆడవాళ్లందరూ పరుగులు తీశారు. ఈ ఘటన బెంగళూరు సమీపంలోని యలహంకలో చోటుచేసుకుంది.

స్థానికంగా జిమ్ నడుపుతున్న అల్విన్(28) అనే యువకుడు పూటుగా మందుకొట్టి.. అటుగా పోతున్న ఓ మహిళను గట్టిగా వాటేసుకున్నాడు. దీన్ని గమనించిన మిగతా స్త్రీలు అక్కడి నుంచి పరుగు అందుకున్నారు. ఈ సందర్భంగా బాధితురాలి అరుపులు విన్న స్థానికులు నిందితుడిని చావగొట్టి పోలీసులకు అప్పగించారు.

కాగా, పోలీసుల విచారణలో అల్విన్ విచిత్రంగా వాదించాడు. ఒంటరిగా వెళుతుంటే లిఫ్ట్ ఇచ్చేందుకు తాను ప్రయత్నించానని తెలిపాడు. కానీ ఆమె ఒప్పుకోకుండా తనను అవమానించడంతో గట్టిగా కౌగిలించుకున్నానని వివరణ ఇచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News