Andhra Pradesh: ప్రజల డేటాను చంద్రబాబు వాడుకోబోతున్నారు.. అందరూ జాగ్రత్తగా ఉండాలి!: విజయసాయి రెడ్డి

  • చంద్రబాబు వద్ద 3.72 కోట్ల మంది డేటా
  • ఆర్థికంగా ప్రలోభపెట్టేందుకు యత్నాలు
  • ఓట్లతో డేటాను లింక్ చేస్తున్నారని వెల్లడి

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించబోతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని 3.72 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన డేటాను ఇందుకోసం వాడుకోబోతున్నారని వెల్లడించారు. ఇందులో పోలింగ్ బూత్ స్థాయిలో ఓటర్ల కులం, మతం, సామాజిక స్థాయి, ఆదాయం సహా పలు వివరాలు నమోదయి ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ డేటాను రియల్ టైమ్ ఓటర్ డేటాతో ప్రభుత్వం లింక్ చేసిందన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను తగ్గించడానికి ఓటర్లను ఆర్థికంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రలోభపెట్టేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ఫేస్ బుక్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.

More Telugu News