ntr: పోలీస్ ఆఫీసర్ గా చరణ్ .. బందిపోటుగా ఎన్టీఆర్?

  • మొదటి షెడ్యూల్ పూర్తి 
  • రెండవ షెడ్యూల్ కి సన్నాహాలు 
  • చరణ్ బాబాయ్ గా సముద్రఖని 
ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా, జనవరిలో సెకండ్ షెడ్యూల్ ను మొదలెట్టనుంది. ఈ కథ ఆంగ్లేయుల కాలంనాటి నేపథ్యంలో   కొనసాగుతుందనే వార్తలు ఆరంభంలోనే వినిపించాయి. ఇక తాజాగా మరో టాక్ ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. ఈ సినిమాలో ఆంగ్లేయుల కాలంనాటి పోలీస్ ఆఫీసర్ గా చరణ్ కనిపిస్తాడనీ .. బందిపోటు పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తాడని అంటున్నారు. ఇక చరణ్ బాబాయ్ పాత్రలో ప్రముఖ తమిళ దర్శకుడు .. నటుడు సముద్రఖని నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. 'రఘువరన్ బీటెక్'లో ధనుశ్ తండ్రి పాత్ర ద్వారా సముద్రఖని తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆయన పాత్ర కూడా చాలా కీలకమైనదని అంటున్నారు. ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోన్న ఈ వార్తలో వాస్తవమెంతన్నది చూడాలి మరి. 
ntr
charan

More Telugu News