rajani: రజనీ తదుపరి చిత్రం మురుగదాస్ తోనే!

  • రజనీకాంత్ తో సినిమా నిజమే 
  • మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుంది
  • లైకాప్రొడక్షన్స్ నిర్మాణం    

రజనీకాంత్ ఈ మధ్య పెద్దగా గ్యాప్ లేకుండగా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. '2.ఓ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన, సంక్రాంతికి 'పెట్టా' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే ఆయన మురుగదాస్ దర్శకత్వంలో మరో ప్రాజెక్టును లైన్లో పెడుతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి.

తాజాగా ఈ వార్తపై మురుగదాస్ స్పందిస్తూ, తమ కాంబినేషన్లో సినిమా రూపొందనున్న విషయం నిజమేనని చెప్పారు. అయితే అంతా కూడా ఈ సినిమా రాజకీయాల నేపథ్యంలో ఉంటుందని అనుకుంటున్నారనీ, కానీ ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అన్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారనీ, సంగీత దర్శకుడిగా అనిరుధ్ వ్యవహరించనున్నాడని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించిన సన్నాహాలే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News