Telangana: కేసీఆర్ డబ్బు బలం ముందు నిలవలేకపోయాం: కాంగ్రెస్ నేత జానా రెడ్డి

  • మిర్యాలగూడలో ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సమీక్ష
  • టీఆర్ఎస్ డబ్బు, మద్యాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసింది: జానారెడ్డి
  • ప్రజలను పూర్తిస్థాయిలో కలవలేకపోయాం: ఆర్.కృష్ణయ్య

ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి గెలిచిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఆరోపించారు. కేసీఆర్ నోట్ల కట్టలే తమ ఓటమికి కారణమన్నారు. డబ్బులు, మద్యం పంపిణీ చేసి టీఆర్ఎస్ విజయం సాధించిందన్నారు. సమష్టిగా కృషి చేసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఎన్నికల ఫలితాలపై సోమవారం మిర్యాలగూడలో కాంగ్రెస్ నేతలు సమీక్ష నిర్వహించారు. జానారెడ్డి, బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈవీఎంలపైనా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని అన్నారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఎన్నికలకు కొన్ని రోజుల ముందే కూటమి అభ్యర్థులను ఫైనల్ చేయడం వల్ల ప్రజలను కలవలేకపోయామన్నారు. మిర్యాలగూడలో తనకు 53 వేల ఓట్లు వచ్చాయని పేర్కొన్న కృష్ణయ్య.. తనకు ఓట్లేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

More Telugu News