Pakistan: పాక్ జైల్లో శిక్ష అనుభవించిన హమీద్ నిహల్ అన్సారీ రేపు భారత్ కు అప్పగింత!

  • 2012లో పాక్ లోకి చొరబడ్డ హమీద్
  • 2015లో అతనికి మూడేళ్ల శిక్ష విధించిన మిలిటరీ కోర్టు
  • ఈ నెల 15తో ముగిసిన జైలు శిక్ష

2012లో ఆన్ లైన్ లో పరిచయమైన పాకిస్థానీ అమ్మాయిని కలిసేందుకు అక్రమంగా ఆ దేశంలోకి చొరబడ్డ భారత జాతీయుడు హమీద్ నిహల్ అన్సారీ. అక్రమంగా చొరబడ్డ నేరంపై అతన్ని పాక్ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

 2015లో అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ పాకిస్థాన్ మిలిటరీ కోర్టు తీర్చు నిచ్చింది. ఈ మూడేళ్ల జైలు శిక్ష ఈ నెల 15తో ముగిసింది. పాక్ అధికారులు రేపు పంజాబ్ లోని వాఘా సరిహద్దు ద్వారా హమీద్ ను మన దేశానికి పంపించనున్నారు.

కాగా, ముప్పై మూడేళ్ల హమీద్ స్వస్థలం ముంబయి. 2012లో ఆఫ్ఘనిస్థాన్ ద్వారా పాకిస్థాన్ లోకి చొరబడ్డాడు. పాకిస్థాన్ కు చెందినట్టుగా నకిలీ గుర్తింపు కార్డు ఉన్న అతన్ని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంది. భారత గూఢచారిగా అతనిపై ముద్ర వేశారు. నకిలీ గుర్తింపు కార్డు కలిగి ఉన్న హమీద్ కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ డిసెంబర్ 15, 2015న పాక్ మిలిటరీ కోర్టు తీర్పు నిచ్చింది.

More Telugu News