నాటి శపథం నేడు నెరవేరింది.. మళ్లీ తలపాగా ధరించిన సచిన్ పైలట్!

  • 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి
  • ఆ సమయంలో శపథం చేసిన సచిన్
  • అప్పటి నుంచి తలపాగా ధరించని యువనేత

రాజస్థాన్ లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే తప్ప తాను తలపాగా ధరించనని 2014లో సచిన్ పైలట్ శపథం పూనారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తిరిగి నాలుగేళ్ల తర్వాత ఆయన తలపాగా ధరించారు. ఎరుపు రంగులో ఉన్న  సంప్రదాయపు తలపాగాను ధరించిన సచిన్ పైలట్  రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, జేడీఎస్ అధినేత దేవెగౌడ తదితరులు హాజరయ్యారు. కాగా, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క లోక్ సభ స్థానంలోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేకపోయింది. ఆ సమయంలోనే సచిన్ పైలట్ ఈ శపథం చేశారు. 

More Telugu News