Prabhas: తన ఫ్యాన్స్ కు ప్రభాస్ మస్కా ఎలా కొడతారంటే..!

  • తరచూ బయట ప్రపంచంలో తిరిగే ప్రభాస్
  • తలకు క్యాప్, ముఖానికి మాస్క్ తో వచ్చే ప్రభాస్
  • 60 టోపీలు, 50 మాస్క్ ల కలెక్షన్

వెండితెరపై కనిపించే తమ అభిమాన తారలు ఒక్కసారిగా బయట తారసపడితే అభిమానులు ఊరుకుంటారా? ఒక్కసారిగా మీద పడిపోయి ఆటోగ్రాఫులు, ఫోటోలు అంటూ ఇబ్బంది పెట్టేస్తారు. అందుకే, తారలు బహిరంగ ప్రదేశాలకు రారు. అయితే, 'బాహుబలి' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ ని తెచ్చుకున్న ప్రభాస్... తరచూ బయట తిరుగుతూ ఉంటాడని తెలుసా? అది కూడా మారువేషంలో సుమా!

బయటకు వెళ్లే సమయంలో వాడేందుకు ప్రభాస్ దగ్గర 60 టోపీలు, 50 రౌండ్ మాస్క్ ల కలెక్షన్ ఉందట. ఫ్యాన్స్ కు మస్కా కొట్టేందుకు ఆయన వీటిని ధరిస్తూ ఉంటాడట. క్యాప్ తో పాటు తల చుట్టూ ఉండే మాస్కులను ప్రభాస్ వాడుతుంటాడట. వీటిని వాడటం వల్ల ప్రభాస్ ను ఎవరూ గుర్తు పట్టరు. ఫ్యాన్స్‌ ను ఇబ్బంది పెట్టకుండా, తను ఇబ్బంది పడకుండా ప్రభాస్ ఇలా ప్లాన్‌ చేసుకుంటాడన్నమాట.

More Telugu News