Chandrababu: గతంలో జరిగిన లోపాలు రిపీట్ కావద్దు: చంద్రబాబు

  • పెథాయ్ తుపానుపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
  • అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి
  • ప్రతి గ్రామానికి ఒక ఫోర్స్ ను సిద్ధం చేయండి

పెథాయ్ తుపాను శరవేగంగా తీరం వైపు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఏటా మనకు తుపాన్లు రావడం సహజమేనని.. ఈ ఏడాది గత రెండు తుపాన్లపై ముందుగానే అంచనా వేశామని... గతంలో జరిగిన పొరపాట్లకు మళ్లీ తావివ్వద్దని అధికారులకు సూచించారు.

ఏయే ప్రాంతంలో ఎంత నష్టం జరగవచ్చో అంచనా వేయాలని, దానికి తగ్గట్టుగా వనరులను సమీకరించుకోవాలని చెప్పారు. తుపాను బాధితులకు అండగా ఉండటమే మన ప్రథమ కర్తవ్యమని అన్నారు. విద్యుత్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. బాధితులకు నీటి ప్యాకెట్లు, ఆహారం అందజేయాలని చెప్పారు. ప్రతి గ్రామానికి ఒక ఫోర్స్ ను సిద్ధం  చేయాలని ఆదేశించారు. సహాయక చర్యల్లో స్థానికుల సహకారం తీసుకోవాలని సూచించారు.

More Telugu News