ranil wikramasinghe: ముగిసిన రాజకీయ సంక్షోభం.. శ్రీలంక ప్రధానిగా విక్రమసింఘె ప్రమాణస్వీకారం

  • సుప్రీంకోర్టు తీర్పుతో ప్రధాని పదవి నుంచి తప్పుకున్న రాజపక్స
  • మరోసారి ప్రమాణస్వీకారం చేసిన విక్రమసింఘే
  • నెలన్నర కిందట విక్రమసింఘేను తప్పించిన సిరిసేన

శ్రీలంక రాజకీయ సంక్షోభం ముగిసింది. ప్రధానిగా రణిల్ విక్రమసింఘే మరోసారి బాధ్యతలను చేపట్టారు. అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అతని చేత ప్రమాణస్వీకారం చేయించారు. నెలన్నర కిందట విక్రమసింఘేను సిరిసేనే ప్రధాని పదవి నుంచి దించేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజపక్స ప్రధాని బాధ్యతలను స్వీకరించారు.

దీంతో, దేశం మొత్తం రాజకీయ సంక్షోభంతో అట్టుడికింది. రాజపక్స నియామకం చెల్లదంటూ సుప్రీంకోర్టు తీర్పును ఇవ్వడంతో... విధిలేని పరిస్థితుల్లో రాజపక్స తప్పుకున్నారు. దీంతో, విక్రమసింఘే మరోసారి ప్రధాని బాధ్యతలను చేపట్టారు. కోలంబోలోని శ్రీలంక అధ్యక్షుడి సెక్రటేరియట్ లో ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేశారు.

More Telugu News