Allu Arjun: అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించిన షారుక్ ఖాన్!

  • బన్నీ చాలా టాలెంటెడ్ అని కితాబు
  • త్వరలోనే కలుస్తానని వెల్లడి
  • జీరో సినిమా ప్రమోషన్ లో కింగ్ ఖాన్

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తన మార్కెట్ ను పెంచుకునే పనిలో బీజీగా ఉన్నాడు. ‘చెన్నై ఎక్స్ ప్రెస్’  సినిమాతో కోలీవుడ్ మార్కెట్ లో అడుగుపెట్టిన షారుక్ తాజాగా టాలీవుడ్ స్టైలిష్  స్టార్ అల్లు అర్జున్ ను ప్రశంసల్లో ముంచెత్తాడు. బన్నీ చాలా టాలెంటెడ్ అని కితాబిచ్చాడు. త్వరలోనే బన్నీని కలుస్తానని ప్రకటించాడు. ప్రస్తుతం తన సినిమా ‘జీరో’ ప్రమోషన్ వేడుకల్లో షారుక్ బిజీగా ఉన్నారు.

ఆనంద్‌ ఎల్‌రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జీరో సినిమాలో షారుఖ్‌ మరుగుజ్జుగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కింగ్ ఖాన్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మలు కత్రినా కైఫ్, అనుష్కా శర్మ నటిస్తున్నారు. ఇటీవలి కాలంలో సరైన హిట్ లేక డీలా పడ్డ కింగ్ ఖాన్ జీరో సినిమాతో తిరిగి ఫామ్ లోకి రావాలని ఉత్సాహంగా ఉన్నాడు.

  • Loading...

More Telugu News