chattisgarh: చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి అంశం కొలిక్కి... బాఘెల్‌కు పగ్గాలు!

  • ఈ సాయంత్రానికి అధికారికంగా ప్రకటించే అవకాశం
  • నాలుగు రోజుల సుదీర్ఘ చర్చ అనంతరం ఎంపిక ‌
  • సీఎల్పీ సమావేశంలో అభ్యర్థి పేరు ప్రకటిస్తారన్న బాఘెల్‌

ఉత్తరాదిలోని మూడు రాష్ట్రాల్లో విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్‌ పార్టీ, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల నియామకం అంశాన్ని ఎట్టకేలకు కొలిక్కి తీసుకువచ్చింది. చత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాఘెల్‌కు పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. విజయం సాధించామన్న ఆనందం కంటే ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక క్లిష్టంగా మారడంతో కాంగ్రెస్‌ అధిష్ఠానానికి తలనొప్పి అయిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలైన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో యువరక్తం, సీనియర్ల మధ్య జరిగిన పోటాపోటీలో ఎట్టకేలకు సీనియర్లవైపే మొగ్గు చూపిన అధిష్ఠానం సమస్యకు తెరదించింది. తాజాగా చత్తీస్‌గఢ్‌ పగ్గాలు బాఘెల్‌కు అప్పగించాలని నాలుగు రోజుల సుదీర్ఘ కసరత్తు అనంతరం పార్టీ చీఫ్‌ రాహుల్‌గాంధీ నిర్ణయించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ముఖ్యమంత్రి ఎవరన్నది ఈరోజు సాయంత్రం జరిగే సీఎల్పీ సమావేశంలో వెల్లడికానుందని స్వయంగా బాఘెల్‌ చెప్పడం గమనార్హం. ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ సీనియర్లు మల్లికార్జున ఖర్గే, పి.ఎల్‌.పూనియా ఇవాల సాయంత్రం రాయపూర్‌ వస్తున్నారు, ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారన్నది వారే ప్రకటిస్తారు‘ అని తెలిపారు.

More Telugu News