Andhra Pradesh: తుపాన్ ముందస్తు చర్యలపై ఆరా.. చంద్రబాబుకు ఫోన్ చేసిన గవర్నర్!

  • ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
  • చంద్రబాబుకు సూచించిన గవర్నర్
  • అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేసిన ఏపీ ప్రభుత్వం

పెథాయ్ తుపాన్ దృష్ట్యా ఏపీలో తీసుకున్న ముందస్తు చర్యల గురించి గవర్నర్ నరసింహన్ ఆరా తీశారు. సీఎం చంద్రబాబునాయుడికి ఫోన్ చేసి ఆ వివరాలను తెలుసుకున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబుకు సూచించారు.

కాగా, శ్రీహరికోటకు 720 కిలోమీటర్ల దూరంలో పెథాయ్ తుపాన్ కేంద్రీకృతమై ఉంది. కాకినాడ-విశాఖపట్టణం మధ్య ఈ నెల 17న తీరం దాటే అవకాశాలున్నాయని వాతావారణ శాఖ అధికారులు చెబుతున్నారు. అధికార యంత్రాగాన్ని ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది.

More Telugu News