vh: పంచాయతీ ఎన్నికల్లో ఇది పునరావృతం కాకూడదు: వీహెచ్

  • మొన్నటి ఎన్నికల్లో చాలా ఓట్లు గల్లంతయ్యాయి
  • బీసీ రిజర్వేషన్లు పెంచాలి
  • బీసీ సంఘాల సమావేశం ఏర్పాటు చేస్తాం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ఓట్లు గల్లంతయ్యాయని టీ-కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) విమర్శించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఇది పునరావృతం కాకూడదని సూచించారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల గురించి ఆయన ప్రస్తావించారు. బీసీ రిజర్వేషన్లను పెంచాలని, ఈ విషయమై త్వరలో బీసీ సంఘాల సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పిన వీహెచ్, బీసీలను అణగదొక్కాలని టీఆర్ఎస్ చూస్తోందని విమర్శించారు. 

More Telugu News