evm`s: ఈవీఎంల ట్యాంపరింగ్ వెనుక కేటీఆర్ ప్రమేయం ఉంది: అద్దంకి దయాకర్

  • తెలంగాణలో ఓట్ల దొంగలు పడ్డారు
  • ఓట్ల తేడా ఎలా వచ్చిందో అధికారుల వద్ద జవాబు లేదు
  • ఆ వివరాలను త్వరలో బయటపెడతాం
  • టీఆర్ఎస్ మంత్రుల ఓటమికి కారణం కేసీఆరే

తెలంగాణలో ఓట్ల దొంగలు పడ్డారని, ఓట్ల తేడా ఎలా వచ్చిందో అధికారుల వద్ద సమాధానం లేదని టీ-కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ విమర్శించారు. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలో బయటపెడతామని, ఈ వివరాలను ముందే చెబితే వాళ్లు జాగ్రత్త పడతారని అన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వెనుక కేటీఆర్ ప్రమేయం ఉందని, మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ మంత్రులు ఓడిపోవడానికి కారణం కేసీఆరేనని తీవ్ర ఆరోపణలు చేశారు.

 ఓటర్ల జాబితాలో గల్లంతైన 20 లక్షల ఓట్లు.. రజత్ కుమార్ క్షమాపణలు చెబితే తిరిగొచ్చాయా? అని సెటైర్లు విసిరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలపై తమకు నమ్మకం లేదని, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని దయాకర్ పేర్కొన్నారు. తుంగతుర్తిలో 17 ఈవీఎంలు మొరాయించాయని, వీవీ ప్యాట్స్ లో స్లిప్స్ ను లెక్కించమంటే లెక్కించ లేదని ఆయన విమర్శించారు.

More Telugu News