TRS: టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడింది: బీజేపీ నేత లక్ష్మణ్

  • ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని అనుమానం
  • లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయి
  • సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాం

టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో జరిగిన ఎన్నికల పోలింగ్ లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న అనుమానాలు తమకు ఉన్నాయని అన్నారు. లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయని, ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో చంద్రబాబు పర్యటన కారణంగా తెలంగాణ వ్యతిరేకులకు, తెలంగాణ వాదులకు మధ్య పోరుగా ప్రజలు భావించారని, కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి గురించి పట్టించుకోకపోవడంతో టీఆర్ఎస్ అధికారంలోకొచ్చిందని అభిప్రాయపడ్డారు.

సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్నామని, ఈ నెల చివరి వారంలో అమిత్ షా, జనవరిలో మోదీ తెలంగాణలో పర్యటించనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా రాఫెల్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ‘రాఫెల్’పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టని, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. 

More Telugu News