Rahul Gandhi: దుష్ప్రచారం చేసిన రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంమాధవ్

  • రాఫెల్ డీల్ పై దుష్ప్రచారం చేశారు
  • సుప్రీం తీర్పు కాంగ్రెస్ కు చెంప పెట్టు
  • మోదీ పారదర్శక పాలనకు సుప్రీం తీర్పు నిదర్శనం
రాఫెల్ డీల్ వ్యవహారాన్ని రాజకీయం చేసి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ లబ్ధి పొందాలని యత్నించారని బీజేపీ నేత రాంమాధవ్ మండిపడ్డారు. రాఫెల్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అని అన్నారు. మోదీ పారదర్శక పాలనకు సుప్రీంకోర్టు తీర్పు నిదర్శనమని చెప్పారు. ప్రధాని మోదీపై దుష్ప్రచారం చేసిన రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జేపీసీ పేరుతో ఆందోళన చేసి, కాంగ్రెస్ నేతలు పార్లమెంటు నుంచి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. 
Rahul Gandhi
modi
ram madhav
rafel
Supreme Court

More Telugu News