Sonia Gandhi: సోనియాగాంధీకి నివేదిక అందించిన పొంగులేటి

  • తెలంగాణ సెంటిమెంట్ కారణంగానే ఓటమి
  • టీడీపీతో పొత్తు స్థానికంగా దెబ్బతీసింది
  • పీసీసీని పునర్వ్యవస్థీకరించాలి
యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై నివేదికను ఆమెకు అందించారు. తెలంగాణ సెంటిమెంట్ కారణంగానే ప్రజాకూటమి ఓటమిపాలైందని నివేదికలో తెలిపారు. టీడీపీతో పొత్తు కూడా స్థానికంగా దెబ్బతీసిందని చెప్పారు. పీసీసీని పునర్వ్యవస్థీకరించాలని సోనియాను కోరారు. లోక్ సభ ఎన్నికల కోసం కొత్త నాయకత్వానికి బాధ్యతలను అప్పజెప్పాలని విన్నవించారు. పొంగులేటి చేసిన సూచనలను సోనియాగాంధీ సావధానంగా విన్నట్టు సమాచారం. 
Sonia Gandhi
ponguleti sudhakar reddy
tpcc
Telugudesam
congress

More Telugu News