rafeal: రాఫెల్ పై కాంగ్రెస్ ది బూటకపు ప్రచారం.. దేశ ప్రజలకు, ఆర్మీకి రాహుల్ క్షమాపణ చెప్పాలి!: అమిత్ షా

  • రాజకీయ ప్రయోజనాల కోసమే రాహుల్ విమర్శలు
  • ఈ ఒప్పందంలో ఎలాంటి ఆశ్రిత పక్షపాతం లేదు
  • ఈ విషయాన్ని సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది
ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో జోక్యం చేసుకోబోమని ఈ రోజు సుప్రీంకోర్టు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో అనుమానాస్పద అంశాలేవీ లేవని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో బీజేపీ చీఫ్ అమిత్ షా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పుతో రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ చేస్తున్న బూటకపు ప్రచారం బట్టబయలు అయిందని విమర్శించారు.

తన రాజకీయ అవసరాల కోసమే రాహుల్ ఇలాంటి ప్రచారానికి తెరలేపారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్లు ఈ ఒప్పందంలో ఎలాంటి ఆశ్రిత పక్షపాతం చూపలేదనీ, ఒప్పంద ప్రక్రియలో ఎలాంటి తప్పు జరగలేదని సుప్రీంకోర్టు స్వయంగా చెప్పిందన్నారు. ఈ వ్యవహారంలో దేశ ప్రజలను, ఆర్మీని తప్పుదారి పట్టించిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ 36 యుద్ధ విమానాలను రూ.58,000 కోట్లకు భారత్ కొనుగోలు చేయనుంది.
rafeal
Congress
Rahul Gandhi
BJP
Amit Shah
sorry
Supreme Court

More Telugu News