Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లు జలమయం!

  • బంగాళాఖాతంలో వాయుగుండం
  • హైదరాబాద్‌పై ప్రభావం
  • పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్‌లో అకస్మాత్తుగా భారీ వర్షం పడింది. గురువారం రాత్రి ఒక్కసారిగా ప్రారంభమైన వర్షం రాత్రంతా కురుస్తూనే ఉంది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావం వల్లే హైదరాబాద్‌లో వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్, బేగంపేట, బంజారాహిల్స్, సనత్‌నగర్, ఎల్‌బీనగర్, అమీర్‌పేట, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. నిజానికి గురువారం మధ్యాహ్నం నుంచే హైదరాబాద్‌లో వాతావరణం మారింది. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. రాత్రి ఒక్కసారిగా వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది.

More Telugu News