Andhra Pradesh: ఏపీకి ఇది పరీక్షా కాలం: సీఎం చంద్రబాబు

  • అందరికంటే ముందుండాలంటే కుట్రలు భగ్నం చేయాలి
  • కేంద్రంలో మోదీ, బీజేపీ ఇంటికి పోతేనే మనకు న్యాయం
  • రెండు రాష్ట్రాలు ముందుకెళ్లాలని అనుకున్నా కానీ..
ఏపీకి ఇది పరీక్షా కాలమని, అందరికంటే ముందుండాలంటే కుట్రల్ని భగ్నం చేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబునాయుడు పిలుపు నిచ్చారు. విశాఖపట్టణంలోని చిట్టివలసలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాలు ముందుకు వెళ్లాలని అనుకున్నాను కానీ, కొంతమంది ఈ రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఉండాలని అనుకుంటున్నారని విమర్శించారు. కేంద్రంలో మోదీ, బీజేపీ ఇంటికి పోతేనే మనకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. కేంద్రం ఏపీకి సహకరిస్తే గుజరాత్ ను మించి అభివృద్ధి చెందుతామని మోదీకి భయమని దుయ్యబట్టారు. 
Andhra Pradesh
Vizag
Chandrababu
modi
bjp

More Telugu News