ram mohan naidu: ప్రజల మధ్య విభేదాలను రెచ్చగొడితే మాత్రం ఊరుకునేది లేదు!: ఒవైసీ వ్యాఖ్యలపై రామ్మోహన్ నాయుడు

  • దేశంలో ఎవరైనా ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు
  • విభేదాలను రెచ్చగొడితే మాత్రం ఊరుకోం
  • ఏపీలో ముస్లింలంతా టీడీపీ వైపే ఉన్నారు
ఏపీలో అడుగుపెడతామని... జగన్ తరపున ప్రచారం చేస్తామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు. దేశంలో ఎవరైనా, ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చని ఆయన అన్నారు. జగన్ తరపున ప్రచారం చేసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ప్రజల మధ్య విభేదాలను రెచ్చగొడితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏపీలోని ముస్లింలంతా టీడీపీ వైపే ఉన్నారని చెప్పారు. ఏపీకి వస్తే ఇక్కడ టీడీపీకి ముస్లింల మద్దతు ఎంతుందో అర్థమవుతుందని అన్నారు. 
ram mohan naidu
Asaduddin Owaisi
jagan

More Telugu News