kodandaram: పంచాయతీ ఎన్నికలకు ఒంటరిగా వెళ్లే యోచనలో టీజేఎస్.. సంకేతాలు ఇచ్చిన కోదండరాం

  • ఒంటరిగా పోటీ చేసే విషయంపై పార్టీ కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది
  • ఒంటరిగా వెళ్లడం వల్ల పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసుకోవచ్చు
  • సైద్ధాంతికంగా ప్రజాకూటమి కొనసాగుతుంది

తెలంగాణలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు టీజేఎస్ ఒంటరిగా వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆ పార్టీ అధినేత కోదండరాం సంకేతాలు ఇచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో కోదండరామ్ మాట్లాడుతూ, 'ఇది ఒక అస్థిరమైన ప్రతిపాదన. పంచాయతీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే విషయంపై పార్టీ కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. పంచాయతీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుందనే అభిప్రాయం ఉంది' అని తెలిపారు.

ప్రజాకూటమి నుంచి టీజేఎస్ బయటకు రాబోతోందని భావించవచ్చా? అనే ప్రశ్నకు బదులుగా... రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి ఏర్పడిందని... సైద్ధాంతికంగా కూటమి కొనసాగుతుందని కోదండరాం సమాధానమిచ్చారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ నెరవేర్చేలా తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు ప్రభావంపై మాట్లాడటానికి ఆయన నిరాకరించారు. కూటమి ఏర్పడే సమయానికి లేట్ అయిపోయిందని... సమయాభావం వల్ల కేసీఆర్ ను ఓడించడానికి సరైన ప్రణాళికను కూడా రచించలేకపోయామని చెప్పారు. 

More Telugu News