Balakrishna: బాలకృష్ణ-నాగబాబు బాగానే ఉన్నారు.. మధ్యలో మీరెందుకు కొట్టుకుంటున్నారు?: ఫ్యాన్స్ కు తమ్మారెడ్డి ప్రశ్న

  • బాలయ్య సినిమాలో నాగబాబు నటించారు.
  • ఆయన కూతురి పెళ్లిలో డ్యాన్స్ కూడా చేశారు
  • ఫ్యాన్స్ బండబూతులు తిట్టుకుంటున్నారని వ్యాఖ్య
నందమూరి, కొణిదెల కుటుంబాల మధ్య చాలాకాలంగా మంచి స్నేహం ఉందని ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఇటీవల బాలకృష్ణ తనకు ఎవరో తెలియదని నటుడు నాగబాబు ఎందుకు చెప్పారో తనకు తెలియదన్నారు. నాగబాబు సరదాగా ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ లో ఎస్వీ రంగారావుగా నాగబాబు నటించినట్లు వార్తలు వచ్చాయనీ, అలాంటిది వారిద్దరి మధ్య విభేదాలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. ఇద్దరు నటుల మధ్య వివాదంపై ‘నా ఆలోచన’ పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు.

బాలకృష్ణ కుటుంబానికి చిరంజీవి కుటుంబం చాలా క్లోజ్ అని భరద్వాజ చెప్పారు. బాలయ్య కూతురి పెళ్లికి చిరంజీవి కుటుంబీకులంతా వెళ్లారనీ, వేడుకల్లో డ్యాన్స్ చేసి అలరించారని గుర్తుచేశారు. నటులు అన్నాక వాళ్లంతా బాగానే ఉన్నారనీ, కానీ అభిమానులు ఎందుకు కొట్టుకుని చస్తున్నారని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో నందమూరి, కొణిదెల అభిమానులు బండబూతులు తిట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానం అన్నది సినిమా చూసేవరకే ఉండాలనీ, కానీ ఇప్పుడు మాత్రం దూషణలు హద్దులు దాటాయని వ్యాఖ్యానించారు. చాలామంది అభిమానులు చేస్తున్న కామెంట్లు అనాగరికంగా ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Balakrishna
nagababu
family
Tollywood
tammareddy
bharadwaja
fans
abuse

More Telugu News