Andhra Pradesh: వైసీపీకి టీఆర్ఎస్ మద్దతుపై కేటీఆర్ స్పందన ఇది!

  • ఇప్పటివరకూ ఏ నిర్ణయమూ తీసుకోలేదు
  • ఎన్నో రాజకీయ పార్టీలు టీఆర్ఎస్ తో స్నేహంగా ఉన్నాయి
  • జగన్ కు మేలు జరగాలన్న కేటీఆర్
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే సంవత్సరం వేసవిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే విషయంలో తాము ఎటువంటి నిర్ణయాన్నీ తీసుకోలేదని టీఆర్ఎస్ యువనేత కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో కేసీఆర్, కేటీఆర్ లు చేసిన పలు వ్యాఖ్యలు, ఏపీ రాజకీయాల్లో టీఆర్ఎస్ ప్రవేశంపై ఊహాగానాలను రేకెత్తించగా, మీడియాతో మాట్లాడుతున్న వేళ, వైసీపీకి మద్దతుపై కేటీఆర్ కు ప్రశ్నలు ఎదురయ్యాయి.

టీఆర్ఎస్ ఇంతవరకూ ప్రత్యేకించి ఏ ఒక్క పార్టీకీ దగ్గర కాలేదని చెప్పిన కేటీఆర్, అనేక పార్టీలతో తాము స్నేహంగా ఉంటున్నామని చెప్పారు. ఏపీలో జగన్ చాలా గట్టి పోటీని ఇస్తున్నారని, ఆయనకు మేలు జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుతానికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం, పాలనపై దృష్టిని సారించామని, ఆపై సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామని కేటీఆర్ అన్నారు.
Andhra Pradesh
Jagan
KTR
Telangana
YSRCP

More Telugu News