venkatesh: 'ఎఫ్ 2' టీజర్ పై స్పందించిన మహేశ్ బాబు

  • వెంకటేశ్ గారి కామెడీ బాగుంది 
  • టీమ్ కి ఆల్ ది బెస్ట్ 
  • వెంకటేశ్ కి జన్మదిన శుభాకాంక్షలు     

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'ఎఫ్ 2' సినిమా నుంచి నిన్న టీజర్ ను వదిలారు. పూర్తి వినోదభరితమైన కంటెంట్ పైనే ఈ టీజర్ ను కట్ చేశారు. ప్రధాన పాత్రధారులందరిని కవర్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ హాయిగా నవ్వుకునేలా చేసింది. తాజాగా ఈ టీజర్ పై హీరో మహేశ్ బాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

"ఈ సినిమా టీజర్ నేను చూశాను. ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ చాలా బాగున్నాయి. భయపడుతున్నట్టుగా వెంకీ చేసిన కామెడీ బాగుంది" అంటూ ఆయన ఈ సినిమా టీమ్ కి బెస్ట్ విషెష్ తెలియజేశాడు. ఇక ఈ రోజున వెంకటేశ్ పుట్టినరోజు కావడం వలన ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. మహేశ్ బాబు నుంచే ప్రశంసలు వచ్చాయంటే, తొలి టీజర్ తోనే అంచనాలు పెంచేయాలనే అనిల్ రావిపూడి ప్రయత్నం ఫలించిందని చెప్పాలి. తమన్నా .. మెహ్రీన్ కథానాయికలుగా సందడి చేసిన ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.     

More Telugu News