Mukesh Ambani: కుమార్తెను పెళ్లి కూతురిగా చూసిన వేళ... ముఖేష్ అంబానీ భావోద్వేగం!

  • ఖరీదైన వివాహాల్లో ఒకటిగా నిలిచిన ఈషా పెళ్లి
  • అదిరిపోయేలా జరిపించిన ముఖేష్ అంబానీ
  • వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు
ఇండియాలో జరిగిన అత్యంత ఖరీదైన వివాహ వేడుకల్లో ఒకటిగా నిలిచిపోయేలా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల గారాలబిడ్డ ఈశా అంబానీ వివాహం ఆనంద్ పిరామల్ తో జరిగింది. ఈ వేడుక నిన్న జరుగగా, తన కుమార్తెను పెళ్లి కూతురిగా చూసిన వేళ, ముఖేష్ అంబానీ కళ్లు ఆనందబాష్పాలతో నిండిపోయాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ బిడ్డను మరొకరి ఇంటికి పంపేవేళ, తల్లిదండ్రులు భావోద్వేగానికి గురవడం సర్వ సాధారణమే. పెళ్లి వేడుకకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ తారాలోకం ఈ వివాహ వేడుకను ప్రత్యక్షంగా తిలకించేందుకు దిగివచ్చింది.
Mukesh Ambani
Esha Ambani
Marriage

More Telugu News