Telangana: పింఛన్ డబ్బుల కోసం నానమ్మను గొడ్డలితో నరికి చంపిన మనవడు

  • పొరుగింటి వృద్ధురాలిపైనా దాడి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • వికారాబాద్ జిల్లాలో ఘటన
మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో నానమ్మను గొడ్డలితో నరికి చంపాడో మనవడు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్‌గోముల్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాల శివకుమార్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం మత్తులోనే ఉండేవాడు. ఈ క్రమంలో బుధవారం మద్యం తాగేందుకు పింఛన్ డబ్బులు ఇవ్వాలంటూ నానమ్మ బిచ్చమ్మ (75)తో గొడవపడ్డాడు.

డబ్బులు ఇచ్చేందుకు ఆమె నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోతూ ఇంట్లోకి వెళ్లాడు. గొడ్డలితో తిరిగొచ్చి మెడపై నరికాడు. ఈ ఘటనలో బిచ్చమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. బిచ్చమ్మ కేకలు విని వచ్చిన పొరుగింటి అంతమ్మ (73) శివకుమార్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో రెచ్చిపోయిన నిందితుడు ఆమెపైనా దాడిచేశాడు. తీవ్ర గాయాలపాలైన అంతమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Telangana
Crime News
Vikarabad District
Murder

More Telugu News