ravivarma: సెట్లో ఎవరికీ దెబ్బలు తగలకూడదనేది బోయపాటి మాట!

  • బోయపాటి పిలిచి మరీ వేషం ఇచ్చారు 
  • యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి 
  • ఆయన చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు
నటుడిగా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ రవివర్మ ఒక్కోమెట్టు పైకెక్కుతున్నాడు. ఇటీవల వచ్చిన 'టాక్సీవాలా'లో ఆయన చేసిన ప్రొఫెసర్ పాత్ర మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. సంక్రాంతికి రానున్న 'వినయ విధేయ రామ' సినిమాలోనూ ఆయన ఒక ముఖ్యమైన పాత్రను చేశాడు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అందుకు సంబంధించిన విషయాలను గురించి ఆయన ప్రస్తావించాడు.

 "ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ గా 'వినయ విధేయ రామ' ఉంటుంది. ఈ సినిమాలో నేను చరణ్ బ్రదర్ గా కనిపిస్తాను. బోయపాటి పిలిచి మరీ ఈ సినిమాలో వేషం ఇచ్చారు. ఆయన సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. ఆయన మాత్రం చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు. సీన్లో ఎవరైతే వుంటారో .. వాళ్లందరిని దగ్గర కూర్చోబెట్టుకుని విషయం అర్థమయ్యేలా చెబుతారు. నా సెట్లో ఎవరికీ దెబ్బలు తగలకూడదు అనే ఉద్దేశంతో ఆయన యాక్షన్ సీన్స్ చిత్రీకరణ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. నిజంగా ఆయన మంచి మనసున్న మనిషి" అని చెప్పుకొచ్చారు. 
ravivarma

More Telugu News