Mukesh Ambani: ముకేష్ అంబానీ కూతురి వివాహ ఖర్చు ఎంతో తెలుసా?

  • యాంటీలియాలో వైభవంగా వివాహం
  • భారీగా ఖర్చు చేస్తున్నారంటున్న సన్నిహితులు
  • ప్రపంచంలో జరగబోయే ఖరీదైన రెండో పెళ్లట
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ కుమార్తె ఈశా వివాహం ఆనంద్ పిరమాల్‌తో జరగనున్న విషయం తెలిసిందే. ముకేష్ నివాసమైన యాంటీలియాలో ఈ వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పుడీ వివాహం దేశంలోనే హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం ఈశా పెళ్లి ఖర్చు.

అది దాదాపు 100 మిలియన్ డాలర్లట. అంటే భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.718 కోట్లు. ముకేష్ ఒక్కగానొక్క కూతురి కోసం ఇంత ఖర్చు చేస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఈ వార్తలు గనుక నిజమైతే ప్రపంచంలో జరగబోయే ఖరీదైన రెండో పెళ్లట ఇది. మొదటిది యువరాజు చార్లెస్, డయానాల వివాహం. ఇప్పటికే ఈశా వివాహం కోసం యాంటీలియాను అద్భుతంగా అలంకరించారు. అతిథుల కోసం ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.
Mukesh Ambani
Isha
anand Piramal
Dayana
Charles

More Telugu News