kcr: ప్రభుత్వ ప్రమాణ స్వీకారం రెండు దశలుగా ఉంటుంది.. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు: కేసీఆర్

  • నాతో పాటు మరొకరు ప్రమాణస్వీకారం చేస్తారు
  • ఐదారు రోజుల్లో మిగిలిన వారు కూడా
  • పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావాలి
ప్రభుత్వ ప్రమాణ స్వీకారం రెండు దశలుగా ఉంటుందని, అర్జెన్సీ వల్ల ముందుగా తనతో పాటు మరొకరు ప్రమాణస్వీకారం చేస్తారని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణభవన్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐదారు రోజుల్లో మిగిలిన వారు ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. కొత్త మంత్రి వర్గంలో అన్ని వర్గాలకు అవకాశముంటుందని స్పష్టం చేశారు.  

 త్వరలోనే పంచాయతీ ఎన్నికలు

తెలంగాణలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ ప్రకటించారు. వారం రోజుల్లో పంచాయతీ రాజ్ ఎన్నికలపై నోటిఫై చేస్తామని, ఈ ఎన్నికలపై హైకోర్టు తీర్పును అమలు చేయాలని అన్నారు. పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఎమ్మెల్యేలకు ఆదేశించినట్టు చెప్పారు. వందరోజుల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశాలివ్వడంతో, ప్రభుత్వం ఏర్పడటం తప్పనిసరి అని, అందుకే, తనతో పాటు మరొకరు రేపు ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు.
kcr
TRS
Telangana bhavan

More Telugu News