paruchuri: పవన్ .. నీ పక్కన కూడా ప్రశ్నించేవారే ఉండాలి: పరుచూరి గోపాలకృష్ణ

  • బీర్బల్ ను అక్బర్ అందుకే వదులుకోలేదు 
  • తెనాలి రామకృష్ణుడి ఆంతర్యం రాయలవారికి తెలుసు
  • అలాంటివారితో పవన్ ముందడుగు వేయాలి       

తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ కి కొన్ని సూచనలు చేశారు. "ఏ నాయకుడు కూడా ఎవరో ఏదో చెప్పేశారని నమ్మేసి నిర్ణయాలు తీసుకోకూడదు. అనుభవం కలిగినవారుగదా అని అవతలవారి ఉద్దేశాలను మనం నమ్మితే ప్రమాదం ఏర్పడుతుంది. ఎప్పుడైనా సరే ప్రశ్నించేవారినే పక్కన పెట్టుకోవాలి.

అక్బర్ గురించి బీర్బల్ చాలా జోకులు వేసేవాడు .. అయినా బీర్బల్ ని అక్బర్ వదులుకోలేదు. ఎందుకంటే తనని బీర్బల్ సున్నితంగా హెచ్చరిస్తున్నాడని అక్బర్ అనుకునేవాడు. కృష్ణదేవరాయలతో తెనాలి రామకృష్ణుడు గుచ్చినట్టుగా మాట్లాడేవాడు. అయినా కృష్ణదేవరాయలు .. తెనాలి రామకృష్ణుడిని తనతోనే ఉండమనేవాడు. ఎందుకంటే తెనాలి రామకృష్ణుడి ఆంతర్యం ఆయనకి అర్థమైపోయేది. అందువలన వ్యవస్థను ప్రశ్నించడానికి వెళ్లిన పవన్ .. నీ పక్కన కూడా ప్రశ్నించేవాళ్లను పెట్టుకుంటే ఆలోచించే అవకాశం ఏర్పడుతుంది. ప్రశ్నించేవారితో కలిసి ముందడుగు వేస్తే అనుకున్న గమ్యానికి చేరుకోగలుగుతావు" అని చెప్పుకొచ్చారు.      

More Telugu News