kcr: కేసీఆర్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు

  • రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రమాణస్వీకారం
  • ఐదుగురు మంత్రులు ప్రమాణం చేసే అవకాశం
  • గవర్నర్ తో భేటీ అయిన పోలీసు అధికారులు

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ వరుసగా రెండోసారి పట్టాభిషిక్తులు కాబోతున్నారు. ఆయన ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారయింది. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో కేసీఆర్ తో పాటు కొందరు మంత్రుల చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి సీనియర్ పోలీసు అధికారులు గవర్నర్ తో భేటీ అయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమంపై చర్చించారు. గవర్నర్ ను కలిసిన వారిలో పోలీస్ కమిషనర్లు అంజన్ కుమార్, మహేశ్ భగవత్, రంగనాథ్ లు ఉన్నారు.

  • Loading...

More Telugu News