koruganti chander: టీఆర్ఎస్ లోకి చేరికలు మొదలు.. మద్దతు ప్రకటించిన స్వతంత్ర అభ్యర్థి

  • రామగుండం నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన కోరుగంటి చందర్
  • ఈరోజు కేటీఆర్ తో భేటీ
  • టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నట్టు ప్రకటన
రామగుండం నుంచి ఇంటిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందిన కోరుగంటి చందర్ టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు కేటీఆర్ కు తెలిపారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు వరకు తాను టీఆర్ఎస్ లోనే ఉన్నానని తెలిపారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ నాయకత్వంలోనే తాను పని చేశానని చెప్పారు. తన మాతృ సంస్థ టీఆర్ఎస్సేనని అన్నారు. 
koruganti chander
ramagundam
mla
TRS
kcr
KTR

More Telugu News