Chandrababu: చంద్రబాబును సాగనంపే వరకు విశ్రమించం.. కేసీఆర్ వస్తే ఆహ్వానిస్తాం: ముద్రగడ

  • కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు మోసం చేశారు
  • పవన్ కల్యాణ్ తీరు కూడా సరిగా లేదు
  • ఘన విజయం సాధించిన కేసీఆర్ కి అభినందనలు
ముఖ్యమంత్రి చంద్రబాబును సాగనంపే వరకు విశ్రమించబోమని కాపు నేత ముద్రగడ పద్మనాభం చెప్పారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన చంద్రబాబు... ఆ తర్వాత మోసం చేశారని ఆయన మండిపడ్డారు. కాపు రిజర్వేషన్ల పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు కూడా తమకు సంతృప్తికరంగా లేదని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసీఆర్ ను ముద్రగడ అభినందించారు. కేసీఆర్ ఏపీకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని చెప్పారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్ మాటలను తాము స్వాగతిస్తున్నామని తెలిపారు.
Chandrababu
kcr
mudragada
Pawan Kalyan
janasena
kapu reservations
TRS
Telugudesam

More Telugu News