Telangana: కిషన్ రెడ్డితో పాటు మరికొందరిని బలి తీసుకున్న 'నోటా'!

  • తెలంగాణ ఎన్నికల్లో నేతల రాతలను తలకిందులు చేసిన నోటా
  • నోటా దెబ్బకు చిత్తయిన కిషన్ రెడ్డి, మదన్ లాల్, అద్దంకి దయాకర్
  • మెజార్టీ కంటే ఎక్కువ వచ్చిన నోటా ఓట్లు

ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో ఎవరూ నచ్చకపోతే... అందరినీ తిరస్కరించేందుకు ఎన్నికల కమిషన్ ఓటర్లకు ఇచ్చిన బలమైన ఆయుధం నోటా (నన్ ఆఫ్ ది అబౌవ్.. పైనున్న ఏ అభ్యర్థీ కాదు). వాస్తవానికి నోటాను ఎవరూ పట్టించుకోలేదన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ, అది ఎంత శక్తమంతమైనదో ఈ ఎన్నికల్లో తేలింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నోటా దెబ్బకు బీజేపీ అగ్ర నేత కిషన్ రెడ్డి, వైరా టీఆర్ఎస్ అభ్యర్థి మదన్ లాల్, తుంగతుర్తిలో కాంగ్రెస్ అబ్యర్థి అద్దంకి దయాకర్ లు ఓటమి పాలయ్యారు.

అంబర్ పేటలో టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశంకు 61,558 ఓట్లు, కిషన్ రెడ్డికి 60,542 ఓట్లు వచ్చాయి. 1,016 ఓట్ల మెజార్టీతో వెంకటేశం గెలుపొందారు. ఇక్కడ నోటాకు 1,462 ఓట్టు పడ్డాయి.

ఖమ్మం జిల్లా వైరాలో స్వతంత్ర అభ్యర్థి రాములుకు 52,650 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ కు 50,637 ఓట్లు వచ్చాయి. మెజార్టీ 2,013 కాగా, నోటాకు 2,360 ఓట్లు పడ్డాయి.

తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ పై టీఆర్ఎస్ అభ్యర్థి సాధించిన మెజార్టీ కూడా నోటా ఓట్ల కంటే తక్కువగానే ఉంది. 

More Telugu News