Andhra Pradesh: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ 28న కలెక్టరేట్ల వద్ద ధర్నా: అశోక్ బాబు

  • ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్
  • రెండు విడతల బకాయిలు చెల్లించాలన్న అశోక్ బాబు
  • సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాల్సిందేనన్న జేఏసీ చైర్మన్

ఈ నెల 28న ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ అశోక్ బాబు తెలిపారు. విజయవాడలో మంగళవారం నిర్వహించిన ఏపీ జేఏసీ సెక్రటేరియట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉద్యోగులకు వెంటనే మధ్యంతర భృతి ప్రకటించాలని, రెండు విడతల బకాయిలను చెల్లించాలని, సీపీఎస్ రద్దుపై నిర్ణయం ప్రకటించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్న డిమాండ్లతో ధర్నా నిర్వహించనున్నట్టు అశోక్ బాబు తెలిపారు.

More Telugu News