kcr: ఖమ్మంలో మా పార్టీని మా నేతలే చంపుకున్నారు: సీఎం కేసీఆర్

  •  చిన్న చిన్న తప్పిదాల వల్ల కొన్ని సీట్లు నష్టపోయాం
  • నలుగురు మంత్రులు, మాజీ స్పీకర్ ఓడిపోయారు
  • వారికి ఫోన్ చేసి మాట్లాడాను
మా పార్టీ నేతల చిన్న చిన్న తప్పిదాల వల్ల కొన్ని సీట్లు నష్టపోయామని, ఖమ్మంలో తమ పార్టీని తమ నేతలే చంపుకున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నలుగురు మంత్రులు, మాజీ స్పీకర్ ఓడిపోయారని, వారికి ఫోన్ చేసి మాట్లాడానని అన్నారు.

తెలంగాణలో ఎవరి సహకారం లేకుండానే తాము అధికారంలోకి వచ్చామని, తమకు ఎవరూ బాస్ లు లేరని, ప్రజలే తమకు ‘బాస్’లు అని, ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి ఆయా పార్టీల నేతలను కలుస్తానని, దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారుతుందని స్పష్టం చేశారు.
kcr
Telangana
bhavan
khammam

More Telugu News