muralimohan: శోభన్ బాబుకి బ్లాంక్ చెక్ పంపించాను .. అయినా తీసుకోలేదు: మురళీమోహన్

  • 'అతడు' సినిమా తీస్తున్న రోజులవి 
  • ఒక పాత్రకి శోభన్ బాబును అనుకున్నాను 
  • ఆయన సున్నితంగా తిరస్కరించారు     
తెలుగు తెరపై అందాల కథానాయకుడిగా శోభన్ బాబు సుదీర్ఘ కాలం పాటు తన హవాను కొనసాగించారు. ఆయన అభిమానులంతా కలిసి 'శోభన్ బాబు సేవాసమితి' పేరుతో ఈ నెల 25వ తేదీన అవార్డుల ప్రదానోత్సవాన్ని జరపనున్నారు. హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఇందుకు వేదికగా మారనుంది.

ఈ విషయాన్ని మీడియాకి తెలియజేయడానికి వచ్చిన మురళీమోహన్ మాట్లాడుతూ, శోభన్ బాబు గురించిన ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. "శోభన్ బాబు ఒక నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోను దానిని మార్చుకోరు. అలాగే ఆయన ఒకసారి ఇక నటించకూడదనే నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో నేను 'అతడు' సినిమా తీస్తున్నప్పుడు అందులో ఒక కీలకమైన పాత్రను శోభన్ బాబు చేస్తే బాగుంటుందని భావించాను. అందుకోసం ఆయనకి బ్లాంక్ చెక్ పంపించాను. అయినా ఆయన సున్నితంగా తిరస్కరించి తన గొప్పతనాన్ని చాటుకున్నారు" అని చెప్పుకొచ్చారు.    
muralimohan
sobhan babu

More Telugu News