bjp: బీజేపీకి సీట్లు తగ్గిపోతాయి.. కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వం!: అసదుద్దీన్

  • కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతివ్వడమా? 
  • ఈ విషయమై నాతో ఎవరు మాట్లాడారో వారు చెప్పాలి
  • వీళ్లకి ఎలా మద్దతిస్తామనుకుంటున్నారు?
ప్రస్తుతం బీజేపీకి ఐదు సీట్లు ఉన్నాయని, ఎన్నికల ఫలితాల తర్వాత వారి సీట్ల సంఖ్య తగ్గిపోతుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ ని ప్రగతి భవన్ లో ఈరోజు కలిసిన అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి తాము మద్దతు ఇస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, ఈ విషయమై తనతో మొదట ఎవరు మాట్లాడారో వారు చెప్పాలని కోరారు. మూడు రోజుల క్రితం తమను ‘సీ’ టీం అని, ‘మోదీ టీం’ అని విమర్శించిన కాంగ్రెస్ నేతలు, వారికి ఎంఐఎం మద్దతు ఇస్తుందని ఎలా అంటున్నారో వారినే చెప్పమనాలి? అని ప్రశ్నించారు.
bjp
TRS
mim
Asaduddin Owaisi

More Telugu News