t-congress: రంగంలోకి దిగిన కాంగ్రెస్ 'ట్రబుల్‌ షూటర్‌' డీకే!

  • టీఆర్ఎస్‌కు బీజేపీ, మజ్లిస్ జై
  • తెలంగాణలో కాంగ్రెస్ కొత్త వ్యూహం
  • కర్ణాటక అస్త్రాన్ని ప్రయోగిస్తున్న కాంగ్రెస్ 

 తెలంగాణలో అసెంబ్లీ ఫలితాలు వెలువడేందుకు మరికొన్ని గంటలే ఉంది. అయితే అన్ని పార్టీల్లోనూ ఒకటే టెన్షన్.. పైకి మేం గెలుస్తామంటే.. మేం గెలుస్తామంటూ చెప్పుకుంటున్నా.. మరోవైపు ఎక్కడో అనుమానం వెంటాడుతోంది. జాతీయ మీడియా చెప్పిన ఎగ్జిట్ పోల్స్‌లన్నీ కారుకే జైకొట్టాయి. కానీ 'ఆంధ్రా ఆక్టోపస్' లగడపాటి రాజగోపాల్ మాత్రం ఆ సర్వేలను కొట్టిపారేశారు. మహాకూటమిదే విజయమని స్పష్టం చేశారు.

ఇలా జాతీయ మీడియా సర్వేకు-లగడపాటి సర్వేకు వ్యత్యాసం రావడంతో ఆయా పార్టీల్లో కనిపించని భయాందోళన నెలకొంది. ఒకవేళ హంగ్ వస్తే ఏంటన్న అంశంపై పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఒకవేళ అదే పరిస్థితి ఎదురైతే తాము సపోర్ట్ చేస్తామంటూ టీఆర్ఎస్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మద్దతు ప్రకటించారు.

మరోవైపు కాంగ్రెస్ కూడా అంతే దీటుగా కసరత్తు మొదలుపెట్టింది. కర్ణాటకలో ఉపయోగించిన వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. జేడీఎస్‌, కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి అతి పెద్ద పార్టీగా సీట్లు సాధిస్తే.. గవర్నర్ మాత్రం బీజేపీని ఆహ్వానించారు. ఆ తర్వాత బలనిరూపణ చేసుకోలేక.. కొద్ది రోజులకే యడ్యూరప్ప ప్రభుత్వం కూలిపోయింది.

దీని వెనుక కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ పన్నిన వ్యూహం ఫలించడంతో ఆయన అధిష్ఠానం దృష్టిలో పడ్డారు. ఇప్పుడూ అదే అస్త్రాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని అగమేఘాలపై డీకేను అధిష్ఠానం రంగంలోకి దింపింది. ట్రబుల్‌ షూటర్‌గా పేరు తెచ్చుకున్న డీకే రంగంలోకి దిగడంతో సర్వత్ర ఆసక్తి రేపుతోంది.

More Telugu News