prajakutami': భాగస్వామ్య పక్షాలను ఒక పార్టీగా భావించాలని గవర్నర్ ని కోరిన ప్రజాకూటమి నేతలు

షార్ట్స్‌లో చూడండి
భాగస్వామ్య పక్షాలను ఒక పార్టీగా భావించాలని గవర్నర్ నరసింహన్ ని ప్రజాకూటమి నేతలు కోరారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ ని కలిశారు. కూటమికి అత్యధిక స్థానాలు వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తమకే ఇవ్వాలని కోరినట్టు సమాచారం. గవర్నర్ ని కలిసిన వారిలో కాంగ్రెస్ నేతలు  ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా, షబ్బీర్ అలీ, మధుయాష్కీ, టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్, టీడీపీ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ ఉన్నారు.
Go Back to Shorts
prajakutami'

More Telugu News