rajani: చెన్నైలో 'బాహుబలి 2' రికార్డును తుడిచేస్తోన్న '2.ఓ'

  • చెన్నైలో కొనసాగుతోన్న జోరు 
  • కేరళలో 'బాహుబలి 2' తరువాత స్థానం 
  • 'భారతీయుడు 2' పనుల్లో శంకర్    

రజనీకాంత్ .. అక్షయ్ కుమార్ కాంబినేషన్లో శంకర్ తెరకెక్కించిన '2.ఓ' ఇంకా తన జోరును కొనసాగిస్తూనే వుంది. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా పాత రికార్డులను తిరగరాయడమే పనిగా పెట్టుకుంది. చెన్నై నగరంలోనూ ఈ సినిమా నేటితో సరికొత్త రికార్డును నెలకొల్పుతోంది. చెన్నై నగరంలో 'బాహుబలి 2' .. 11 రోజుల్లో 18.50 కోట్లు వసూలు చేసింది. ఇక్కడ అత్యధిక వసూళ్లను సాధించిన రికార్డు ఇప్పటివరకూ ఈ సినిమా పేరుతోనే వుంది.

ఈ రోజుతో ఈ రికార్డును '2.ఓ' తుడిచేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ 18.41కోట్లను వసూలు చేసిన '2.ఓ' .. ఈ రోజుతో 'బాహుబలి 2' రికార్డును అధిగమించనుంది. ఇక కేరళలో 'బాహుబలి 2' తరువాత అత్యధిక వసూళ్లను రాబట్టిన అనువాద చిత్రంగా '2.ఓ' నిలిచింది. ఒక వైపున ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే, మరో వైపున 'భారతీయుడు 2' సినిమాకి సంబంధించిన సన్నాహాలు చేసుకోవడంతో శంకర్ బిజీగా వున్నాడు.     

More Telugu News