BJP: రేపటితో తెలంగాణలో కాంగ్రెస్‌ పని అయిపోయినట్టే : బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు

  • టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి గడ్డం తీసుకునే యోగ్యత లేదు
  • కాంగ్రెస్‌ అవకాశవాద దివాళాకోరు రాజకీయాలకు తెరలేపిందని విమర్శ
  • ఎన్నికల్లో చర్చ అవినీతిపైకి కాకుండా సెంటిమెంట్‌పైకి మళ్లింది

కాంగ్రెస్‌ పార్టీ దివాళాకోరు రాజకీయాల వల్ల  తెలంగాణ ఎన్నికల్లో పూర్తిగా భ్రష్టుపట్టి ప్రజలకు దూరమయిందని, మంగళవారంతో ఆ పార్టీ పని అయిపోయినట్టేనని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు విమర్శించారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ అవకాశవాద రాజకీయంతో రాష్ట్రంలో అవినీతి, దోపిడీపై జరగాల్సిన చర్చ సెంటిమెంట్‌పైకి మళ్లిందన్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని తెచ్చి నెత్తిన ఎక్కించుకున్న కాంగ్రెస్‌ చెంపను ప్రజలు చెళ్లుమనిపించబోతున్నారని జోస్యం చెప్పారు.

దీంతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి గడ్డం తీయించుకునే యోగ్యత లేనట్టేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు  గెలుపుపై నమ్మకం ఉంటే ఈవీఎంలపై ఏడుపు ఎందుకని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి షాక్‌లో ఉన్నట్లున్నారని, అందుకే బ్యాలెన్స్‌ తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అంటే ఏంటో చూపించామని, ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చినా శిరసావహిస్తామని చెప్పారు.

More Telugu News