Telangana: రేపు వెల్లడయ్యే తొలి ఫలితం భద్రాచలందే..!

  • భద్రాచలంలో 161 పోలింగ్ కేంద్రాలు
  • ఉదయం 11.30 కెల్లా ఫలితం
  • ఆలస్యంగా వెల్లడికానున్న శేరిలింగంపల్లి ఫలితం

తెలంగాణ ఎన్నికల తరువాత ఓట్ల లెక్కింపు రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుండగా, తొలిగా భద్రాచలం ఫలితం వెలువడనుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 161 పోలింగ్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఒక్కో రౌండ్ ఓట్ల లెక్కింపు 14 టేబుళ్లపై జరుగుతుంది. దీంతో ఉదయం 11.30 గంటలలోపే భద్రాచలం ఫలితం వెలువడవచ్చని తెలుస్తోంది. కాగా, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో గరిష్ఠంగా 580 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో ఈ నియోజకవర్గ ఫలితం మిగతా వాటితో పోలిస్తే కాస్తంత ఆలస్యంగా వెలువడే అవకాశాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News