Mukesh Ambani: సంగీత్ లోనే రొమాంటిక్ టచ్... కాబోయే భార్యను ఎత్తుకుని ముద్దాడిన ఆనంద్ పిరామల్... వీడియో!

  • నేటి నుంచి వివాహ వేడుకల్లో అసలు ఘట్టం
  • నిన్న రాత్రి వైభవంగా సంగీత్
  • ఆడిపాడిన సెలబ్రిటీలు
ఈశా అంబానీ, ఆనంద్ పిరామల్ ల వివాహ వేడుకల అసలు ఘట్టం నేటి నుంచి ప్రారంభం అవుతుండగా, నిన్న రాత్రి జరిగిన సంగీత్ వేడుకల్లో వధూవరులు ఆడిపాడారు. శ్రావ్యంగా వస్తున్న సంగీతానికి తగ్గట్టుగా వీరిద్దరూ లయబద్ధంగా ఆడారు. ఈశాను దగ్గరకు తీసుకున్న ఆనంద్, ఆమెను రెండు చేతులతో ఎత్తుకుని ముద్దాడాడు.

ఈ వేడుకల్లో పాల్గొన్న పలువురు బాలీవుడ్ హీరోలు ఆడి పాడారు. ఉదయ్ పూర్ లోని ఓ ప్రముఖ హోటల్ ఇందుకు వేదికైంది. షారూక్ ఖాన్, రణబీర్ కపూర్, కుషీ కపూర్, రియా కపూర్, అమీర్ ఖాన్, కిరణ్ రావు, కరిష్మా కపూర్, జాన్వీ కపూర్, సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

Mukesh Ambani
Esha Ambani
Anand Piramal
Marriage
Sangeet
Dance
Kiss

More Telugu News