akhil: క్రిస్మస్ కి సందడి చేయనున్న అఖిల్

  • వెంకీ అట్లూరి నుంచి రొమాంటిక్ లవ్ స్టోరీ 
  • హైలైట్ గా నిలవనున్న తమన్ సంగీతం
  • జనవరి 25న రిలీజ్ చేసే ఆలోచన  

అఖిల్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకుడిగా 'మిస్టర్ మజ్ను' నిర్మితమైంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నుంచి, ఈ నెల 13వ తేదీన గానీ .. 14వ తేదీన గాని ఒక సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఈ నెల 25వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.

 టీజర్ తోను .. సాంగ్ తోను అంచనాలు మరింతగా పెంచేయాలనే ఆలోచనలో వున్నారు. ముందుగా ఈ సినిమాను సంక్రాంతికే విడుదల చేయాలనుకున్నారు. కానీ సంక్రాంతికి గట్టిపోటీ ఉండటంతో ఈ సినిమాను జనవరి 25వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. తమన్ సంగీతం ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో అఖిల్ జోడీగా నిధి అగర్వాల్ కనువిందు చేయనున్న సంగతి తెలిసిందే.  

  • Loading...

More Telugu News