Balakrishna: నాగబాబుపై మండిపడుతున్న బాలయ్య ఫ్యాన్స్!

  • బాలయ్య ఎవరో తెలియదన్న నాగబాబు
  • తనకు పాత తరం నటుడు బాలయ్య మాత్రమే తెలుసన్న చిరు సోదరుడు
  • దారుణంగా ట్రోల్ చేస్తున్న బాలకృష్ణ ఫ్యాన్స్
మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబుపై నందమూరి బాలకృష్ణ అభిమానులు మండిపడుతున్నారు. ఆయనను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ.. తనకు బాలయ్యబాబు ఎవరో తెలియదని, సీనియర్ నటుడు బాలయ్య మాత్రమే తనకు తెలుసని అన్నారు. ఆయన మాటలతో హర్ట్ అయిన బాలయ్య ఫ్యాన్స్ 'బాలయ్య ఎవరో మీకు తెలియదా?' అని ప్రశ్నిస్తున్నారు.

జనసేనతో టీడీపీకి ఉన్న వైరం కారణంగానే ఆయనలా అని ఉంటారని మరికొందరు అంటున్నారు. గతంలో ఓసారి బాలకృష్ణ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని అన్నారు. దీంతో అప్పట్లో పవన్ అభిమానులు కూడా ఇలాగే బాలయ్యను ట్రోల్ చేశారు. నాలుగేళ్ల క్రితం టీడీపీని గెలిపించాడే.. ఆయనే పవన్ కల్యాణ్ అంటూ కామెంట్లు చేశారు. తన సోదరుడిని ఎవరో తెలియదని బాలయ్య అప్పుడు చెప్పడం వల్లే ఇప్పుడు నాగబాబు ఇలా అన్నారంటూ పవన్ అభిమానులు వివరణ ఇస్తున్నారు.
Balakrishna
Naga babu
Pawan Kalyan
Telugudesam
Chiranjeevi
Tollywood

More Telugu News