Shruti Hassan: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • నిర్మాతగా మారిన శ్రుతి హాసన్ 
  • 16న 'కథానాయకుడు' ట్రైలర్ 
  • 'పింక్' రీమేక్ లో విద్యాబాలన్ 
*  'కాటమరాయుడు' చిత్రం తర్వాత తెలుగు సినిమా ఏదీ చేయని కథానాయిక శ్రుతిహాసన్ గత కొన్నాళ్లుగా నటనకు దూరంగానే వుంది. ఈ నేపథ్యంలో ఈ చిన్నది తాజాగా నిర్మాతగా మారింది. 'మస్కిటో ఫిలాసఫీ' పేరిట ఓ చిత్రాన్ని నిర్మించింది. దీనికి జయప్రకాశ్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించాడు. మంచి కథలు వస్తే ముందు ముందు కూడా సినిమాలు నిర్మిస్తానని శ్రుతి చెప్పింది.
*  బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం 'కథానాయకుడు' జనవరి 9న విడుదలకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఈ నెల 16న ఈ చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
*  రెండేళ్ల క్రితం హిందీలో వచ్చిన 'పింక్' చిత్రాన్ని తమిళంలో అజిత్ హీరోగా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో కథానాయికగా బాలీవుడ్ భామ విద్యాబాలన్ ను ఎంచుకున్నట్టు సమాచారం. దీనిని తెలుగులోకి కూడా అనువదిస్తారు.
Shruti Hassan
Balakrishna
krish
ajith

More Telugu News