Revanth Reddy: సవాల్ కు కట్టుబడకపోతే.. మీది కల్వకుంట్ల వంశమే కాదని భావించాల్సి ఉంటుంది!: కేటీఆర్ కు రేవంత్ ఛాలెంజ్

  • కొడంగల్ లో నేను ఓడిపోతే రాజకీయాలను వదిలేస్తా
  • గెలిస్తే కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకోవాలి
  • సవాల్ కు కేటీఆర్ కట్టుబడి ఉండాలి
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కొడంగల్ ప్రజాకూటమి అభ్యర్థి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కొడంగల్ లో తాను ఓడిపోతున్నానని నిన్న కేటీఆర్ వ్యాఖ్యానించారని... అదే జరిగితే తాను రాజకీయాలకు శాశ్వతంగా దూరమవుతానని చెప్పారు. సవాల్ కు కట్టుబడి తాను గెలిస్తే... కేటీఆర్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని సవాల్ చేశారు. కేటీఆర్ ఆయన సవాల్ కు కట్టుబడి ఉండాలని... తాను గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకోవాలని అన్నారు. లేని పక్షంలో మీది కల్వకుంట్ల వంశమే కాదని భావించాల్సి ఉంటుందని చెప్పారు. 
Revanth Reddy
KTR
challenge
kodangal
TRS
congress

More Telugu News